AP | కేక్ కటింగ్ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే

AP | కేక్ కటింగ్ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే

  • టీఎన్టీయూసీ బలోపేతానికి కృషి చేయాలి.
  • సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు…

AP | పాయకాపురం, ఆంధ్ర ప్రభ : టీఎన్టీయూసీ బలోపేతానికి కృషి చేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టీఎన్టీయూసీ మీడియా కో ఆర్డినేటర్ లక్కిశెట్టి కనకరావు జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే బొండా ఉమా సమక్షంలో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు లక్కిశెట్టి కనకరావుతో కలసి కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం బొండా ఉమా మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేసి ప్రతి యొక్క కార్యకర్తలను, నాయకులను గుర్తింపునిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని సతీష్, గొట్టుముక్కల వెంకీ,దేవరాపు మాల్యాద్రి,బూదల సురేష్,కంచేటి నాగరాజు,దుర్గాశి రాము,బుగత రవి తదితరులు
పాల్గొన్నారు.

Leave a Reply