రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కేశినేని..

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కేశినేని..

విజయవాడ, ఆంధ్రప్రభ : ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ ను పురస్కరించుకొని ముస్లిం సోదర, సోదరీమణులకు, ముస్లిం కుటుంబాల వారికి విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని ) రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం రంజాన్ పండుగ నేపథ్యంలో ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

అల్లాహ్ కరుణ ప్రతి ఒక్కరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ.. రంజాన్ ముబారక్” తెలిపారు. నియమ నిబంధనలతో ముస్లిం సోదరులు చేసిన రంజాన్ ఉపవాస దీక్షలు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య, ఐశ్వర్యాలను ప్రసాదించాలని అల్లాహ్ ను తాను సైతం ప్రార్థిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాధ్ పేర్కొన్నారు.