Maoists Dead | కాల్పుల మోత

Maoists Dead | కాల్పుల మోత

  • ఇంద్రావతి నేషనల్ పార్క్‌లో ఎన్‌కౌంట‌ర్‌
  • ఇద్దరు మావోలు మృతి

Maoists Dead | చర్ల, ఆంధ్రప్రభ : మరోమారు ఛత్తీస్‌గ‌డ్‌ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. ఆపరేషన్ క‌గార్‌లో భాగంగా బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు బస్తర్ ఐజీ పి.సుందర్‌రాజ్ నేతృత్వంలో డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా దళాలు ఇవాళ తెల్లవారుజామున జాయింట్ కూబింగ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.

ఈ క్రమంలోనే మావోయిస్టులు కంటప‌డగా ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆయుధాలు, రైఫిళ్లతో పాటు పేలుడు పదార్థాలు, వివిధ సాహిత్యం ల‌భించినట్లు డీఆర్జీ బృందాలు వెల్లడించాయి. ప్రస్తుతం కూబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని బస్తర్ ఐజీ పి.సుందర్‌రాజ్ పేర్కొన్నారు. మృతుల సంఖ్య, ఆయుధాల రికవరీకి సంబంధించి మరింత సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది.

Leave a Reply