Beach | నెల్లూరులో పండగ పూట తీవ్ర విషాదం

Beach | నెల్లూరులో పండగ పూట తీవ్ర విషాదం

Beach | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : అల్లూరు మండలం ఇసుకపల్లి సముద్రతీరంలో విషాదం చోటుచేసుకుంది. కనుమ పండగ పూట ఈతకెళ్లి సముద్రంలో నలుగురు యువకులు గల్లంతు అయ్యారు. వీరందరూ అల్లూరు పంచాయితీ ఎర్రప గుంటకు చెందిన యువకులు. మత్స్యకారులు సముద్రంలో నుంచి ఓ విద్యార్థి మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చారు. మిగతా ముగ్గురు కోసం బోటు వేసుకొని స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

Leave a Reply