Kurnool | వసతి గృహం పిల్లలకు భోగి పళ్లు

Kurnool | వసతి గృహం పిల్లలకు భోగి పళ్లు
Kurnool | కర్నూలు, ఆంధ్రప్రభ : రాయలసీమ మహిళా సంఘ్ నిర్వహిస్తున్న అశోక్ నగర్ పంప్ హౌస్ దగ్గర ఉన్న నిరాశ్రయుల గృహంలో భోగిమంటలు వేసి, పిల్లలకు భోగి పళ్లు పోయడం జరిగింది. రాయలసీమ మహిళా సంఘ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, సబ్ sc, st విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ రాయలసీమ శకుంతల మాట్లాడుతూ..
భోగి పండుగ రోజు భోగిమంటలు వేసి, మనకు ఉన్న అజ్ఞానాన్ని, ద్వేషాలన్ని వదిలి జ్ఞానంతో ఉండాలని అన్నారు. అలాగే మన ఇంట్లో ఉన్న పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేయడం ఆనవాయితీగా వస్తుందని, అప్పుడు అన్ని చెక్కతో చేసే సామాన్లు ఉండేవని, అవి పాతగా ఉండి ఇంట్లో పెట్టడం వలన రోగాలు రావడం జరిగేవని, అందుకే సంవత్సరానికి ఒకసారి వచ్చే సంక్రాంతి పండుగ రోజు భోగి మంటలు ఆ వస్తువులను పారవేసేవారు. అలాగే ఈరోజు పిల్లలకు భోగి పళ్ళు కూడా పోస్తారు. రేగుపండ్లనే భోగి పండ్లు అని ఈరోజు సంబోధిస్తారు. భోగి పళ్ళతోపాటు పూలు, చిల్లర పైసలు, చెరుకు గడలు చాక్లెట్లు అన్నీ కలిపి పిల్లలకు తలపై పోస్తారు. రేగి పళ్ళు కూడా సూర్యుని వర్ణంలో ఉంటాయి కాబట్టి పిల్లలకు అవి పోయడం వల్ల ఆరోగ్య ప్రయాతగా దీర్ఘాయుష్షుగా ఉంటారని మన పెద్దల నమ్మకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ధరణి, కళావతి, గౌతమి నిరాశ్రయులు పాల్గొన్నారు
