దండేపల్లిని స్వచ్ఛ మండలంగా తీర్చిదిద్దాలి….

దండేపల్లిని స్వచ్ఛ మండలంగా తీర్చిదిద్దాలి….
ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు….
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలన్ని స్వచ్ఛ మండలంగా తీర్చిదిద్దాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99రోజుల ప్రజాపాలనలో భాగంగా ఆదివారం దండేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ… ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చెప్పారు.
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మిషన్ భగీరథ ద్వారా గ్రామంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం మండలం లోని లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను అందజేసి, జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ మహిళ కార్మికుల కు శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సర్పంచ్ లు వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
