ఆర్ధిక భరోసా కల్పించడమే మార్గదర్శి విధానం…

ఆర్ధిక భరోసా కల్పించడమే మార్గదర్శి విధానం…
పాయకాపురం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపుమేరకు, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు మార్గదర్శిగా తన పేరును ఖరారు చేయడం ద్వారా డివిజన్లో అనేకమంది కి తమ జీవనోపాధి నిమిత్తం ఆర్ధిక భరోసా కల్పించే విధంగా చిన్న చిన్న వ్యాపారులు చేసుకొనే విధంగా బడ్డి కొట్టు అందజేయడం జరిగిందని 64వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్ అన్నారు.
పి.4 పథకం నిరుపేద కుటుంబానికి చెందిన ఎండి జానీని బంగారు కుటుంబంలోకి తీసుకొని అతని కుటుంబ నిమిత్తం బడ్డీ కొట్టు ఏర్పాటు చేసి దానికి కరెంటు మీటర్ పెట్టించి మంగళవారం పలువురు టీడీపీ శ్రేణులు, ప్రజల సమక్షంలో ప్రారంభించడం జరిగిందని రవికుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎస్ కె బాబు, యూనిట్ ఇన్చార్జి కోమరి రాజేష్, సీనియర్ నాయకులు కంకణాల బాబు స్థానికులు పాల్గొన్నారు.
