50km | పల్లెనిద్రతో ప్రజాపాలన వైపు

50km | పల్లెనిద్రతో ప్రజాపాలన వైపు
50km | ప్రజలతో మమేకమవుతున్న కలెక్టర్ పి.రాజాబాబు
పల్లెనిద్ర కార్యక్రమాలతో సమస్యల పరిష్కారం
జల సురక్ష మిషన్‌తో సురక్షిత మంచినీటి సరఫరా
రామాయపట్నం పోర్టుతో భారీ పెట్టుబడులు
పారిశ్రామికాభివృద్ధిలో ఒంగోలు కొత్త దిశగా
బిపిసిఎల్, ఇండోసోల్ వంటి పరిశ్రమలకు భూముల కేటాయింపు
బీచ్ కారిడార్ అభివృద్ధికి రూ.40 కోట్ల ప్రణాళిక
స్కిల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
50km | ఒంగోలు, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రకాశం జిల్లాలో సమగ్రాభివృద్ధిలో ప్రకాశింపజేసే విధంగా జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ప్రత్యేక దృష్టిసారిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల సదస్సులో దిశా నిర్దేశం చేసిన విధంగానే వాటన్నింటిని జిల్లాలో అమలుచేస్తూ తన మార్కు పాలన సాగిస్తున్నారు. ప్రధానంగా ప్రజలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ పల్లెనిద్రలతో మమేకమవుతున్నారు. జిల్లాలో పల్లెనిద్ర సాగిస్తూ ఆమండలంలో ఉన్న సమస్యలను అప్పటికపుడు పరిష్కరిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు.
జల సురక్ష మిషన్ ద్వారా ప్రజలకు సురక్షితమైన మంచినీరు ఇచ్చేందుకు కూడా ఆయన ప్రత్యేక కృషి చేస్తున్నారు. ప్రధానంగా రామాయపట్నం పోర్టు కేంద్రంగా 50కి.మీల రేడియస్ పరిధిలో 3.50లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు జిల్లాకు వచ్చాయని తెలిపారు. ప్రధానంగా బిపిసిఎల్, ఇండోసోల్, జిందాల్ స్కీమ్, రిలజన్స్ వంటి పరిశ్రమలు ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో విశాఖపట్నం తరహాలో ఒంగోలు పారిశ్రామికాభివృద్ధి జరగనుందని ఆయన పేర్కొన్నారు. ఈ పాటికే బిపిసిఎల్ కు 3వేల ఎకరాలను ఇవ్వడం జరిగిందని, 1500 ఎకరాలు ఇండోసోల్ కు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ పరిశ్రమలన్నీ పూర్తయ్యేందుకు స్కిల్, ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ , టౌన్‌షిప్ వంటివి అవసరమని తెలిపారు. బీచ్ కారిడార్ అభివృద్ధి చేసేందుకు రూ. 40కోట్లు ఖర్చుచేయనున్నట్లు వెల్లడించారు.
