2021Assemblyelc | మ‌మ‌త మాజీ అనుచ‌రుడు సువేంద్ అధికారి

2021Assemblyelc | మ‌మ‌త మాజీ అనుచ‌రుడు సువేంద్ అధికారి

ఒక‌ప్పుడు మ‌మ‌త‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తుడు
ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా మారిన సువేంద్‌
2021లో టీఎంసీ పార్టీ నుంచి బీజేపీలోకి జంప్‌
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలకంగా బీజేపీ నేత
2021, 2026లో మ‌మ‌త‌ను ఓడించిన సువేంద్‌
సువేంద్ సీఎం అయ్యే అవకాశం ఉందని చర్చ

2021Assemblyelc | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత కీలకమైన బీజేపీ నేత. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో బలమైన నేతగా ఉన్న ఆయన, ఇప్పుడు అదే పార్టీకి, మమతకు ప్రధాన ప్రత్యర్థిగా మారారు. మమతకు అత్యంత సన్నిహితుడిగా ఉండి, తర్వాత ఆమెను రాజకీయంగా సవాలు చేసిన సువేందు అధికారి, ప్రస్తుతం బీజేపీ తరపున బెంగాల్‌లో పార్టీని బలోపేతం చేయడంలో, ముఖ్యంగా మమతకు చెక్ పెట్టడంలో కీలక పాత్ర పోషించారు.

2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, నందిగ్రామ్ నియోజకవర్గంలో సిట్టింగ్ సీఎం మమతా బెనర్జీని ఓడించి ‘జైంట్ కిల్లర్’గా నిలిచారు. 2026 ఎన్నికల్లో కూడా ఆయన మమతా బెనర్జీపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, భవానీపూర్ నియోజకవర్గంలో కూడా ఆమెను ఓడించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెల‌వ‌డంతో సువేందు అధికారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.