Tirupati | ఏమైందో ఏమో…

Tirupati | ఏమైందో ఏమో…

Tirupati | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా తడ మండలం కొండూరు వద్ద ఇవాళ విషాదం చోటుచేసుకుంది. రైలు కిందపడి ఇద్దరు స్నేహితులు ఆత్మహత్య చేసుకున్నారు.

మృతులను పేర్నాడుకు చెందిన సునీల్, పిండిపాలేనికి చెందిన కల్యాణ్‌గా పోలీసులు గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు కుటుంబ, ఆర్థిక సమస్యలా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.