కేంద్ర ప్రభుత్వం తక్షణమే దేశవ్యాపితంగా నిషేధించాలి..

కేంద్ర ప్రభుత్వం తక్షణమే దేశవ్యాపితంగా నిషేధించాలి..

గడ్డి మందు నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానించడం అభినందనీయం
బికెయంయు జాతీయ కార్యవర్గ సభ్యుడు వెంకట్రాములు

కరీమాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఐఎంఏ లాంటి సంస్థలు, అనేక మంది మేధావులు చేసిన డిమాండ్ మేరకు రాష్ట్ర శాసనసభలో పారాక్వాట్ డైక్లోరైడ్ ప్రాణాంతక గడ్డి మందును నిషేధిస్తూ తీర్మానించడాన్ని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు అభినందించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ అనేక రకాలైన పురుగు మందులకు విరుగుడు చికత్స ఉన్నప్పటికీ పారాక్వాట్ గడ్డి మందుకు విరుగుడు చికిత్స మాత్రం లేక పోవడం అత్యంత ప్రమాదకరంగా తయారైందన్నారు.

ఈ ప్రాణాంతక గడ్డి మందును అనేక దేశాలలో ఇప్పటికే నిషేధించారని, ఈ మందును ఉత్పత్తి చేసే స్వీట్జర్లాండ్ లో కూడ దీన్ని నిషేధించారన్నారు. వ్యవసాయంలో దీనిని వినియోగిస్తూ రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలైన రైతు కూలీలు చిరు వ్యాపారులు, చేతివృత్తుల వారు, కుటుంబ సమస్యలతో తీవ్రంగా సతమతమవుతున్న వారు, నిరాశ నిస్పృహలకు గురైన యువతీ యువకులు క్షణికావేశంలో ప్రాణాంతక గడ్డి మందు తాగి వేలాదిమంది ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబాలు దిక్కులేనివై పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు.

Leave a Reply