చిన్నారులను అబినందిస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

చిన్నారులను అబినందిస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం…
అభినందించిన సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు..
పాయకాపురం, ఆంధ్ర ప్రభ : చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన చిన్నారులను సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అభినందించారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల వారి కార్యాలయంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ మధ్యకట్ట ప్రాంతానికి చెందిన తాతపూడి కుటుంబ సభ్యులు ఆదివారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావును వారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.వివరాలలోకి వెళితే గత నెల ఫిబ్రవరి 2వ తేదీన హైదరాబాదులో గిన్నిస్ ప్రపంచ రికార్డుల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కీబోర్డ్ సంగీత కార్యక్రమంలో ప్రపంచంలోని 22 దేశాలకు చెందిన సుమారు 2,000 మంది కీబోర్డ్ వాయిద్యకారులు పాల్గొని గంటసేపు నిరంతరాయంగా కీబోర్డ్ వాయించిన నలుగురు చిన్నారులు విశేష ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 777 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించగా, విజయవాడ హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ప్రత్యేక అభినందన సభలో ప్రశంసాపత్రాలు అందజేయడం జరిగింది.ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఒకే కుటుంబానికి చెందిన తాతపూడి ఆరాధన, తాతపూడి అభిషేక్, తాతపూడి జీవన్ జాయ్, తాతపూడి వరలక్ష్మీ స్థానం సంపాదించడం అత్యంత అరుదైన విషయం అని బొండా ఉమామహేశ్వరరావు వారిని అభినందించారు. ఒకే ఇంటి నుంచి నలుగురు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడం ప్రతి తల్లిదండ్రికి, ప్రతి విద్యార్థికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, గొట్టుముక్కల వెంకటేశ్వరరాజు, 30 డివిజన్ అధ్యక్షుడు లక్కం రాజ్ శ్రీనివాసరాజు, ఇంచార్జ్ కరణం వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి చొక్కాకుల వీరభద్ర హనుమాన్, లక్కిశెట్టి సాయి, గాతలవలస మురళి, అక్కం లక్ష్మణ, రమణ తదితరులు పాల్గొన్నారు.
