జమ్మూ కశ్మీర్ లోని ఎల్ఓసీ సమీపంలో జరిగిన ఐఈడీ పేలుడులో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.
మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జమ్మూ జిల్లాలోని ఖౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలసోని కేరీ బత్తల్ ప్రాంతంలోని ఎల్వోసీ సమీపంలో ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు గాయపడగా.. వారిని ఆర్మీ ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో ఇద్దరు చికిత్స సమయంలో మరణించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
ఉగ్రవాదుల కోసం గాలింపు..
అధికారుల ప్రకారం.. అఖ్నూర్ సెక్టార్ లోని నియంత్రణ లేఖ దగ్గ ఆర్మీ బృందం గస్తీ కాస్తోంది. ఆ సమయంలో ఉగ్రవాదులు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఆదనపు ఆర్మీ దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిని సైనికులను ఆస్పత్రికి తరలించిన తర్వాత ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ప్రారంభించారు.
పేలుడుకు సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు. ఉగ్రవాదులు అమర్చి ఉంటారని భావిస్తున్న ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్(IED)పేలడం వల్ల పేలుడు సంభవించిందని ప్రాథమిక సమాచారం వెల్లడించింది.