కార్మికులు లేబర్ కార్డులు సద్వినియోగం చేసుకోవాలి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం మంజూరు చేసిన లేబర్ కార్డు ప్రతి కార్మికుడు సద్వినియోగం చేసుకోవాలని కొత్తపల్లి సర్పంచ్ ఆర్. నర్సిములు అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలో ని కొత్తపల్లిలో అర్హులైన కార్మికులకు లేబర్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నవివిధ సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు.
వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు విధిగా లేబర్ కార్డు తీసుకోవాలన్నారు. కార్మికుల హక్కులను కాపాడేందుకుముందుంటానని అన్నారు. లేబర్ కార్డు ఉండటం వల్ల కార్మికులకు కలిగే లాభాలను గురించి వివరించారు. కొత్తపల్లి గ్రామంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ లేబర్ కార్డులు మంజూరు చేసే విధంగా చూస్తామన్నారు. కార్మికరంగంలో పనిచేస్తున్న అర్హులకు ప్రభుత్వ పలాలు అందే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బలరాం, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
