Amaravati | వాహనాల ధ్వంసంపై కఠిన చర్యలు తీసుకోవాలి

హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి

Amaravati | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి పేర్ని వెంక‌ట్రామ‌య్య (పేర్ని నాని) అమరావతిలో జరిగిన దాడి ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించారు. అమరావతిలో జరుగుతున్న అకృత్యాలు బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ దాడులు జరిగాయని ఆరోపించారు.

ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పథకం ప్రకారమే ఈ దాడులు చేయించారని పేర్ని నాని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, వాహనాలను ధ్వంసం చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

దాడిలో గాయపడిన హెడ్ కానిస్టేబుల్ పరిస్థితిపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తలకు తీవ్ర గాయమై స్పృహ కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. అమరావతి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్ని నాని ప్రభుత్వాన్ని కోరారు.