ఘనంగా పల్లా శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు..

ఘనంగా పల్లా శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు..

అవనిగడ్డ – ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు మంగళవారం అవనిగడ్డలో ఘనంగా జరిగాయి. స్థానిక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు, నాయకులు ఈ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో నాయకులు కేక్‌ను కట్ చేసి పల్లా శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని సంతోషాన్ని పంచుకున్నారు. రాష్ట్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో పల్లా శ్రీనివాసరావు పోషిస్తున్న పాత్రను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ క్లస్టర్ ఇంచార్జ్ బండే రాఘవ, ఘంటసాల క్లస్టర్ ఇంచార్జ్ పాటిబండ్ల నరేష్, పార్టీ నాయకులు మండలి రామమోహనరావు, పర్చూరి దుర్గాప్రసాద్, మెగావత్తు గోపి, దాసినేని శ్రీనివాసరావు, కంచర్ల ఆనంద్, మేడికొండ విజయ్, ముళ్లపూడి శ్రీనివాసరావు, కొండవీటి గోవిందు, గాలం శ్రీను, నీల మనోహర్, చోడబత్తిన విజయ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply