నూతన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌కు ఘన సన్మానం

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బీరన్న గుడి వద్ద శనివారం గ్రామ శాఖ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నూతన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్‌ను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ముప్పు శ్రీనివాస్ మాట్లాడుతూ, తనకు మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, స్థానిక నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మండలంలో ఎలాంటి భేదాభిప్రాయాలకు తావులేకుండా ప్రతి కార్యకర్తను సమానంగా గౌరవిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.

రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షుడు శీలం అనిల్ కుమార్, మార్కెట్ డైరెక్టర్ గొడిశాల రాజయ్య, డాక్టర్ బొల్లెపోగు రమేష్ బాబు, శనిగరపు వెంకటేష్, సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు, మాజీ సర్పంచులు గొడిశాల యాదగిరి, నల్లాల రాజిరెడ్డి, లోకిని సూరయ్య, బొజ్జ గోపాల్, కాంగ్రెస్ యువ నాయకుడు గొడిశాల అర్జున్ గౌడ్, కోరే పున్నం, జనగాని లక్ష్మీనారాయణ, అంబాల జగన్, గొడిశాల వినయ్, ప్రదీప్, రమేష్, వెంకట్, యువరాజ్, నాగరాజు, ముదిరాజ్ సంఘం నాయకులు, రజక సంఘం నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.