Trump – Zelenskyy | ట్రంప్‌, జెలెన్‌స్కీ భేటీ

Trump – Zelenskyy | ట్రంప్‌, జెలెన్‌స్కీ భేటీ

Trump – Zelenskyy | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : నాలుగేళ్ల క్రితం మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. దీనికి ముగింపు పలికేలా అమెరికా అధ్యక్షుడు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఫలించడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Trump – Zelenskyy) భేటీ అయ్యారు. శాంతి ప్రణాళికపై ఇరువురు నేతలు వివరంగా చర్చించినట్లు సమాచారం.

భేటీ అనంతరం ట్రంప్ (Trump) మాట్లాడుతూ…. యుద్ధ ముగింపున‌కు తుది గడువు ఏమీ లేదని, కానీ దాన్ని త్వరగా ముగించడంపైనే ప్రధాన దృష్టి సారించినట్లు తెలిపారు. దౌత్య ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడించిన ట్రంప్, ఆ చర్చలు ఫలవంతంగా సాగాయని, శాంతి సాధనకు దోహదపడేలా ఉన్నాయన్నారు.

ఈ భేటీ రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) యుద్ధ ముగింపున‌కు కొత్త ఆశలు కల్పించినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శాంతి చర్చలు మరిన్ని దశలు దాటాల్సి ఉన్నప్పటికీ, ఈ భేటీ దౌత్య ప్రయత్నాలకు ఊతమిచ్చినట్లు కనిపిస్తోంది.