4yrs | హయత్‌నగర్‌లో విషాద ఘటన

4yrs | హయత్‌నగర్‌లో విషాద ఘటన

4yrs | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి మోసం చేసిందనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

గోవర్ధన్‌, సరిత అనే యువజంట నాలుగేళ్లుగా ప్రేమించుకుని కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. వీరికి ఒక బిడ్డ కూడా జన్మించాడు. అయితే ఇటీవల సరిత తన బిడ్డను అమ్మేసి, మరో వ్యక్తిని వివాహం చేసుకునేందుకు సిద్ధమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తనతో తిరిగి రావాలని గోవర్ధన్ పలుమార్లు బతిమాలినా సరిత నిరాకరించడంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. అనంతరం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply