మృతుని ఆచూకీ తెలపండి : సిఐ శ్రీ హర్ష

మృతుని ఆచూకీ తెలపండి : సిఐ శ్రీ హర్ష

రాప్తాడు, ఆంధ్రప్రభ : రాప్తాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మైనారిటి కాలనీ నందు సాయి కృష్ణ వెంచర్ దగ్గరలో రైల్వే ట్రాక్ ప్రక్కన కంప చెట్లలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం పడివున్నదని సమాచారం అందిన వెంటనే రాప్తాడు సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ శ్రీ హర్ష తన సిబ్బందితో కలిసి వెళ్లి మృతి చెందిన మగ వ్యక్తిని అంబులెన్స్ ద్వారా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అలాగే కేసు నమోదు చేశారు. సిఐ శ్రీ హర్ష వివరాలు తెలియజేస్తూ మృతి చెందిన మగ వ్యక్తి వయస్సు సుమారు 35 నుండి 45 సంవత్సరాలు ఉంటుంది. ఆయన ఎద పైన కుడి ప్రక్కన పుష్ప అను ట్యాటు, తేలు మార్కు ట్యాటు ఉందని గుర్తించమన్నారు. మృతుని శరీరం పైన నలుపు రంగు కట్ బనియన్ వుండి దాని పైన సన్స్ అవుట్ గన్స్ అవుట్ అని ఇంగ్లీష్ లో అక్షరాలు ఉన్నాయి. నలుపు రంగు జీన్స్ ప్యాంటు నీలం రంగు షర్ట్ వేసుకున్నారు.

లైట్ సీమెంటు రంగు బెల్టు ఉంది.జేబులో మోటార్ సైకిల్ కీ, ఖైని ప్యాకెట్ ఉందన్నారు. ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉంది. మృతుని వివరాలు తెలియరాలేదు. ఈ ప్రకటన చూసిన వెంటనే ఎవరికైనా మృతుని వివరాలు తెలిస్తే రాప్తాడు సిఐ టీవీ శ్రీ హర్ష సెల్ ఫోన్ నెంబర్: 9440796817 కు లేదా రాప్తాడు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని తెలియజేశారు.

Leave a Reply