300 km | ఐదేళ్లలో 200 రైళ్లు తయారు చేస్తామన్న కేంద్ర మంత్రి

300 km | ఐదేళ్లలో 200 రైళ్లు తయారు చేస్తామన్న కేంద్ర మంత్రి
300 km | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కాజీపేట రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు దాదాపు పూర్తికావచ్చాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. త్వరలోనే ఇక్కడ ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
రాబోయే ఐదేళ్లలో కాజీపేట యూనిట్‌లో 200 ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా స్వల్ప దూర ప్రయాణాల కోసం ఈ రైళ్లను వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.
ఇంటర్‌సిటీ రైళ్లు సాధారణంగా సుమారు 300 కిలోమీటర్ల వరకు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయని అశ్వినీ వైష్ణవ్ వివరించారు. కాజీపేట రైల్వే యూనిట్ ప్రారంభంతో తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.
