1st FebCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
1st FebCartoon | నేడు పార్లమెంటులో బడ్జెట్: సామాన్యుల ఆశలు, వాస్తవం
1st FebCartoon | బడ్జెట్ పై ఉత్కంఠ ఎందుకు? సామాన్యులపై ప్రభావం ఎంత?
1st FebCartoon | బడ్జెట్ పై దేశ ప్రజల ఉత్కంఠకు కారణాలు
బంగారం, వెండి ధరలు – బడ్జెట్ లో మార్పులు ఉంటాయా?
బడ్జెట్ ప్రభావం సామాన్యుల దాకా ఎందుకు ఆలస్యం?
ఆర్థిక వాస్తవాన్ని వ్యంగ్యంగా చూపిన కార్టూన్
ఆంధ్రప్రభ ‘ఔరా’ కార్టూన్ ఫీచర్ ప్రత్యేకత

1st FebCartoon | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నేడు పార్లమెంటులో భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పై యావత్ భారత దేశప్రజలందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే, ఆగకుండా పరుగులెత్తుతున్న వెండి, బంగారం ధరలకు ఈ బడ్జెట్ లో ఏమైనా కళ్ళెం వేయనున్నారా అనేది ప్రధానంగా అందరూ ఎదురుచూస్తున్న అంశం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పేరుతో బెదిరింపులు…దానివల్ల ప్రపంచ దేశాలలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, భారత్ పై ప్రభావం, ఏ ఐ వల్ల కొత్తగా వచ్చే ఉద్యోగాలు, కోల్పోతున్న ఉద్యోగావకాశాలు, ప్రజల్లో ఆందోళనలు…ఈ ఏడాదిలో ఏయే రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి? అక్కడ పార్టీని గెలిపించాలాంటే ప్రభుత్వపరంగా ఇవ్వాల్సిన తాయిలాలు, వీటన్నిటినీ దృష్టిలోపెట్టుకుని తయారు చేసిన బడ్జెట్ ఇది.
కానీ, బడ్జెట్ అనేది ఎప్పుడైనా ప్రతిపాదిత సంఖ్యల సూచిక మాత్రమే. వాటి ప్రకారం పూర్తిగా జరగొచ్చు, జరగకపోవచ్చు. జరిగినా, జరగకపోయినా, వాటి ప్రభావం సామాన్యుల దాకా సత్వరమే ప్రభావం చూపడం అనేది ఉండకపోవచ్చు.
ఎందుకంటే, దేశ బడ్జెట్ అంటే, భారీ స్థాయిలో కేటాయింపులు, అంటే, వందలు, వేలకోట్లలో లెక్కలు. మరి ఇవి ఒక వ్యక్తి, లేదా కుటుంబం వరకు వచ్చేసరికి ఎంతవరకు ప్రభావం చూపుతాయనేది మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సంక్షేమ పథకాల్లాంటి వాటి కేటాయింపులు కూడా బిల్లులు, ఆమోదం, అమలు, ఇన్ని దశలు దాటుకుని ప్రజలకు చేరాలి. వీటికీ ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, కారణాలు, దశలు, మళ్ళీ అందులో ప్రాంతాలపరంగా ప్రాధాన్యతలు.
కానీ బడ్జెట్ ను పట్టించుకోకపోతే తమకేం తెలియదని, తమకు బడ్జెట్ పై అవగాహన లేదని అందరూ అనుకుంటారని చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు బిల్డప్ ఇస్తూంటారు. చాలా టేన్షన్ పడిపోతుంటారు. ఏదో జరిగిపోతుందనీ, ఆ ప్రభావమంతా తమపైన వచ్చి పడిపోతుందనీ మరీ మరీ ఎదురు చూస్తూంటారు. ఈ విషయాన్నే చమత్కారంగా చూపించిన ఆంధ్రప్రభ కార్టూనిస్ట్ మాధవ్ కార్టూన్ ఇది.
రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తున్న కార్టూన్ ఫీచర్ ఔరా.
