TET | ప్రారంభమైన టెట్ పరీక్షలు

హైదరాబాద్‌, పాఠశాల విద్యాశాఖ నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)లు నేటి నుంచి ప్రారంభమయ్యాయి 30 వరకు నిర్వహించనున్న టెట్‌ పరీక్షకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో 66 కేంద్రాల్లో ( 66 centers) ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అన్ని ఏర్పాట్లు పూర్తచేశామని టీజీటెట్‌ చైైర్‌పర్సన్‌, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్‌ నికోలస్‌ తెలిపారు.

నిర్ణీత తేదీల్లో ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు సెషన్‌- 1; మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలు జరుగుతాయి. జూన్‌ 18, 19, 24 (మొదటి షిఫ్టు), 28, 29, 30 తేదీల్లో పేపర్‌ -2 పరీక్షలు జరగనుండగా.. జూన్‌ 20, 23, 24 (రెండో షిఫ్టు), 27 తేదీల్లో పేపర్‌ -1 పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 15 నుంచి 30 వరకు టెట్‌కు దరఖాస్తులు ఆహ్వానించగా 1.83లక్షల దరఖాస్తులు వచ్చాయి. పేపర్‌ 1కు 63,261మంది, పేపర్‌-2కు 1,20,392మంది దరఖాస్తు చేసుకోగా.. రెండు పేపర్లకు దరఖాస్తు చేసినవారు 15వేల మంది వరకు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply