4వ తరగతి పార్ట్ టైం వర్కర్ల వేతనాలు పెంచాలి
4వ తరగతి పార్ట్ టైం వర్కర్ల వేతనాలు పెంచాలి
పీఓపీ విన్నవించిన సంఘ నాయకులు
ఉట్నూర్, ఆంధ్రప్రభ: గిరిజన సంక్షేమ శాఖ అశ్రమ వసతి గృహాల్లో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల పార్ట్ టైం శానిటేషన్ వర్కర్ల వేతనాలు పెంచాలని కోరుతూ.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏపీవో యువరాజు మర్మాట్ కు పీఓ ఛాంబర్ లో బుధవారం కలిసివిన్నవించినట్లు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కేబీసీ నారాయణ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కేబీసీ నారాయణ పీఓతో మాట్లాడుతూ.. గతంలో ఉమ్మడి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ద్వారా వేతనాలు పెంచాలని గత ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణికి విన్నవించగా పీవో మాట్లాడి, ఆ ఫైల్ ని తెప్పించుకొని వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని, ఫైలు కూడా సిద్ధం చేశారని అన్నారు. పీఓ యువరాజ్ మర్మాటుకు కలిసి విన్నవించామని, ఎందుకంటే గత సంవత్సరం ఈ సంవత్సరం కూడ డైలివేజేస్ వేతనాలు పెరిగిన్నాయని కాబట్టి మా పార్ట్ టైం శానిటేషన్ వాళ్లకు కూడ వేతనాలు పెంచాలని కోరడం జరిగిందని కేబీసీ నారాయణ తెలిపారు. దీంతో పీఓ సానుకూలంగా స్పందించే హామీ ఇవ్వడంతో ఆయనకు సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపినట్లు కేబీసీ నారాయణ పేర్కొన్నారు.
పీఓను కలిసిన వారిలో మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల అధ్యక్షులు జి. రామచందర్, రాజ లింగు, రవి, మహేష్ ఆదిలాబాద్ జిల్లా ఆర్గనైజ్ సెక్రెటరీ అశోక్, నాయకులు 4వ తరగతి ఉద్యోగులు పాల్గొన్నట్లు రాష్ట్ర గౌరవాధ్యక్షులు కేబీసీ నారాయణ తెలిపారు.
