Kannepalli ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి
Kannepalli ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి
- సీఐటీయూ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రాలు
కన్నెపల్లి (Kannepalli), ఆంధ్రప్రభ:
అంగన్‌వాడీ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ (సీఐటీయూ) మండల ప్రధాన కార్యదర్శి కోట రాజమణి డిమాండ్ చేశారు. ఈ మేరకు సమస్యల పరిష్కారం కోరుతూ మండల తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈవోలకు వినతిపత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది మే 26న జారీ చేసిన సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,131 ప్రీ-ప్రైమరీ, పీఎం శ్రీ కేంద్రాలను రద్దు చేసి వాటిని అంగన్‌వాడీ కేంద్రాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు గత 50 ఏళ్లుగా సేవలందిస్తున్నారని తెలిపారు. అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయాలని కోరారు.
అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన 2026 విద్యా విధానాన్ని సవరించి, ఐసీడీఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు వైరోనిక, సరిత, హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.
