దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంకి నివాళులు..

దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంకి నివాళులు..

బంటుమిల్లి – ఆంధ్రప్రభ : బంటుమిల్లి మండలం ముంజలూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో చనిపోయిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పూలమాలవేసి నివాళ్లు అర్పించారు.

ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ.. జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో 256 మంది దళితుల పై దాడులు చేసారని, దళిత న్యాయమూర్తి పైన, దళిత డాక్టర్ సుధాకర్ ని చిత్రహింస చేసి చంపేశారన్నారు. దళితులను చంపిన ఎవరేమీ చేయలేరని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేశారని డోర్ డెలివరీని చేసిన అనంత బాబును జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తూ పార్టీలోనే కొనసాగిస్తున్నారన్నారు. దళితులను మేనమామ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి దళితుల వినాశనాన్ని కోరుకునే కంస మామయని ఆరోపించారు.