Special trains | ప్రయాణికులకు గుడ్‌న్యూస్..

ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే


Special trains | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఊరట కలిగేలా మూడు జతల వారాంత ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కోయంబత్తూర్–జైపూర్, బాంద్రా టెర్మినల్–వేళంకన్ని, పూరీ–సోలాపూర్ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. కోయంబత్తూర్–జైపూర్ (06181) ప్రత్యేక రైలు ఈ నెల 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 3 వరకు వారానికి ఒకసారి నడవనుంది. అలాగే పూరీ–సోలాపూర్ (08445) ప్రత్యేక రైలు ఆగస్టు 7 నుంచి సేవలు ప్రారంభించనుంది.

ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం 3ఏసీ కోచ్‌లు ఏర్పాటు చేశారు. ఇక వేళంకన్ని–బాంద్రా టెర్మినల్ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. పండుగలు, సెలవుల నేపథ్యంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలిపారు.