21stMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

21stMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

21stMarchCartoon | పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం
చమురు ధరల పెరుగుదలతో ప్రపంచ ఆందోళన
కార్టూన్‌లో సామాన్యుడి నిస్సహాయత

21stMarchCartoon
21stMarchCartoon

పశ్చిమాసియాలో రగులుతున్న అగ్నికీలలు, యుద్ధజ్వాలల ఫలితంగా ఇప్పటికే అంతర్జాతీయంగా అనేక ఒత్తిడులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఆర్థికంగా, చివరికి గెలుపెవరిదైనా ప్రపంచం మొత్తం ఈ భారం మోయాల్సి రావచ్చు అన్నా అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఇప్పుడు ధ్వంసమవుతోన్న వనరులు, చమురు బావులు చాలా విలువైనవి, ప్రత్యామ్నాయం లేనివి. వాటినుంచి చమురు అందితేనే భవిష్యత్తు ఎలా అన్న ప్రశ్న ఒకపక్క ప్రపంచాన్ని వేధిస్తుంటే, ఇక ఉన్న చమురు బావులు కూడా ధ్వంసమవుతే ఏమిటి భవిష్యత్తు?

యుద్ధం ఫలితం…అనేక సమాధానం లేని ప్రశ్నలు..అంతులేని విషాదాలు.. ఇప్పటికే పైపైకి ఎగబాకుతోన్న చమురు బ్యారెల్ ధరలను మోయలేకపోతున్న ప్రపంచ దేశాలకు, ఆ ధరలు కాస్తా మరింత పెరిగే ప్రమాదముందన్న సంకేతం నిజంగా పిడుగులాంటి వార్తే. చమురు ధరలను ఎగసిపడుతున్న జ్వాలలతో పోల్చిన సింపుల్ కాన్సెప్ట్ నేటి ఆంధ్రప్రభ కార్టూన్ ఔరా.

ఎగసిపడే జ్వాలలను అరికట్టలేక, వాటి సెగను భరించలేక బిత్తరపోయి చూస్తున్న సామాన్యుడి నిస్సహాయత ఇందులో చూపించబడింది.

ఆంధ్రప్రభ అందించిన కార్టూన్ ఔరా గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తోన్న కార్టూన్ ఫీచర్ ఔరా.

click here for more cartoons

click here for more oura

Leave a Reply