207Locations | మోడీ సమక్షంలో ఘనంగా ప్రమాణ స్వీకారం
207Locations | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎమ్మెల్యే సువేందు అధికారి రాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఏపీ సీఎం చంద్రబాబు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకుని చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు టీఎంసీ కేవలం 80 స్థానాలకు పరిమితమై 15 ఏళ్ల పాలనకు తెరపడింది. భవానీపూర్ నియోజకవర్గంలో మాజీ సీఎం మమతా బెనర్జీపై సువేందు అధికారి విజయం సాధించడం రాజకీయంగా కీలక మలుపుగా మారింది.
