ఘనంగా కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షునికి సన్మానం

నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తిని కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ సమతా సుదర్శన్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ విభాగ పరిశీలకుడిగా నియమితులైన సమతా సుదర్శన్‌ను మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, రెండో వార్డు కౌన్సిలర్ కత్తి నరేందర్‌లను సమతా సుదర్శన్ శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా సమతా సుదర్శన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు కొంతం గణేష్ తదితరులు పాల్గొన్నారు.