Rs 686 Cr Investments : వావ్​.. కర్నూల్ Andhra Prabha Top Story

Rs 686 Cr Investments : వావ్​.. కర్నూల్ Andhra Prabha Top Story

  • రక్షణ రంగంలో పెట్టుబడుల వెల్లువ
  • డ్రోన్ తయారీ హబ్‌గా ఓర్వకల్ ఎదుగుదల
  • రూ.686 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల జోరు
  • వేలాది ఉద్యోగ అవకాశాలకు మార్గం
  • రోబోటిక్స్, ఏఐ, ఏరోస్పేస్ రంగాలకు ప్రాధాన్యం
  • యువతకు స్థానికంగానే భారీ ఉపాధి అవకాశాలు
  • రక్షణ తయారీ కేంద్రంగా ఏపీ లక్ష్యాలు
  • కర్నూలుపై జాతీయ సంస్థల దృష్టి
  • .రూ.686 కోట్ల తో కొత్త పరిశ్రమల జోరు.
  • 2000 మందికి ఉపాధి

కర్నూలు బ్యూరో , ఆంధ్రప్రభ)

Rs 686 Cr Investments

రాయలసీమ పారిశ్రామిక రంగంలో కర్నూలు జిల్లా వేగంగా కొత్త గుర్తింపును సంపాదిస్తోంది. ముఖ్యంగా డ్రోన్ తయారీ, రోబోటిక్స్, రక్షణ పరికరాల తయారీ, వైమానిక సాంకేతిక రంగాల్లో భారీ పెట్టుబడులు జిల్లాకు రావడం పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపడుతున్న ప్రోత్సాహక చర్యలతో కర్నూలు జిల్లా దేశవ్యాప్తంగా “డ్రోన్ సిటీ”గా ఎదిగే దిశగా ముందుకెళ్తోంది. తాజాగా ప్రకటించిన పలు పారిశ్రామిక ప్రాజెక్టుల్లో కర్నూలు జిల్లాకు గణనీయమైన పెట్టుబడులు దక్కనున్నాయి. డ్రోన్ తయారీ, కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికత, రోబోటిక్స్, రక్షణ రంగ తయారీ యూనిట్లు జిల్లాలో స్థాపించేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. వీటి ద్వారా భారీ పెట్టుబడులతో పాటు వేలాది ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయి.

Rs 686 Cr Investments : డ్రోన్ హబ్​ కి భారీ పెట్టుబడులు

Rs 686 Cr Investments

డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.255 కోట్ల పెట్టుబడితో కర్నూలులో డ్రోన్ తయారీ యూనిట్ స్థాపించేందుకు సిద్ధమైంది. వ్యవసాయం, నిఘా, రక్షణ రంగాలకు అవసరమైన ఆధునిక డ్రోన్ల తయారీ చేపట్టనున్న ఈ సంస్థ ద్వారా సుమారు 850 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్ రంగానికి చెందిన హెచ్‌సీ రోబోటిక్స్ సంస్థ రూ.100 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ నెలకొల్పనుంది. పరిశ్రమల ఆటోమేషన్, రక్షణ రంగ అవసరాలకు ఉపయోగించే యంత్ర వ్యవస్థల తయారీపై ఈ సంస్థ దృష్టి సారించనుంది. దీని ద్వారా సుమారు 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎయిర్ పేస్ ఇండస్ట్రీస్ సంస్థ రూ.100 కోట్లతో వైమానిక రంగానికి అవసరమైన విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. డ్రోన్, విమాన రంగాలకు అవసరమైన కీలక భాగాల తయారీ చేపట్టే ఈ సంస్థ ద్వారా 150 మందికి ఉపాధి లభించనుంది.

Rs 686 Cr Investments : కమర్షియల్ సేవలకు ఊతం

Rs 686 Cr Investments

జేడీకే ఫ్లై డ్రోన్ వరల్డ్ సంస్థ రూ.114 కోట్ల పెట్టుబడితో కమర్షియల్ డ్రోన్ సేవల అభివృద్ధికి ముందుకొచ్చింది. వ్యవసాయం, గనులు, భూసర్వే, పోలీసింగ్ వంటి రంగాలకు అవసరమైన డ్రోన్ సేవలను అందించనుంది. ఈ యూనిట్ ద్వారా 350 మందికి ఉపాధి లభించనుంది. సెన్స్ ఇమేజ్ టెక్నాలజీస్ సంస్థ రూ.68 కోట్లతో డ్రోన్లకు అవసరమైన హైటెక్ కెమెరాలు, సెన్సార్ వ్యవస్థల అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ ద్వారా 45 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అల్గోబాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.34 కోట్ల పెట్టుబడితో కృత్రిమ మేధస్సు ఆధారిత డ్రోన్ నియంత్రణ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కేంద్రాన్ని స్థాపించనుంది. ఈ యూనిట్ ద్వారా 52 మందికి ఉపాధి లభించనుంది.
డ్రోన్ ల్యాబ్ టెక్నాలజీస్ సంస్థ రూ.5 కోట్లతో పరిశోధన, నమూనా తయారీ కేంద్రాన్ని ప్రారంభించనుంది. లాట్రిక్ ఏరో స్పేస్ సంస్థ రూ.10 కోట్ల పెట్టుబడితో చిన్న వైమానిక పరికరాలు, డ్రోన్ విడిభాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.

Rs 686 Cr Investments : రూ.686 కోట్ల పెట్టుబడులు

Rs 686 Cr Investments

ప్రస్తుతం ప్రకటించిన ఈ పరిశ్రమల ద్వారా మాత్రమే కర్నూలు జిల్లాకు సుమారు రూ.686 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రత్యక్షంగా 2,086 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అనుబంధ పరిశ్రమలు, రవాణా, హాస్టళ్లు, సాంకేతిక సేవలు, ఇతర సేవారంగ అవకాశాలను కలుపుకుంటే ఉపాధి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పరిశ్రమల శాఖ అధికారులు చెబుతున్నారు.

Rs 686 Cr Investments : ఓర్వకల్ కేంద్రంగా …

Rs 686 Cr Investments

పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం ప్రత్యేక పారిశ్రామిక మండలాల ఏర్పాటుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓర్వకల్ పారిశ్రామిక కేంద్రం, డ్రోన్ క్లస్టర్, వైమానిక పార్క్ నమూనాలో భూముల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. డ్రోన్ తయారీ సంస్థలకు విమాన ప్రయోగాలకు అనుకూలమైన విస్తార భూభాగం అవసరం కావడంతో ఓర్వకల్ పరిసర ప్రాంతాలకు ప్రాధాన్యం పెరిగినట్లు తెలుస్తోంది

Rs 686 Cr Investments : కర్నూలుకే ఎందుకు ?

Rs 686 Cr Investments

పారిశ్రామిక వర్గాల విశ్లేషణ ప్రకారం కర్నూలుకు కొన్ని ప్రత్యేక అనుకూలతలు ఉన్నాయి. ఓర్వకల్ విమానాశ్రయం సమీపంలో ఉండటం, తక్కువ ఖర్చుతో విస్తార భూభాగం లభించడం, హైదరాబాద్–బెంగళూరు మధ్య వ్యూహాత్మక ప్రాంతంగా ఉండటం, రక్షణ రంగ పరిశ్రమలకు అనుకూల వాతావరణం, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి కారణాలతో పలు సంస్థలు కర్నూలుపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

Rs 686 Cr Investments : రక్షణ తయారీ కేంద్రంగా

Rs 686 Cr Investments

ఆంధ్రప్రదేశ్‌ను రక్షణ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రక్షణ రంగ పరిశ్రమలు ఏర్పాటవుతుండగా, కర్నూలును డ్రోన్ మరియు అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

  • Rs 686 Cr Investments : యువతకు భారీ అవకాశాలు

ఈ పరిశ్రమల ద్వారా ఇంజినీరింగ్, డిప్లొమా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, వైమానిక రంగాల్లో చదువుకున్న యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు లభించనున్నాయి. స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరగడంతో వలసలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రెండేళ్లలో కర్నూలు జిల్లా రాష్ట్ర పారిశ్రామిక పటంలో కీలక స్థానాన్ని సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ALSO READ : Rs 400 Cr Project : ఇక కర్నూలు సోనా ధగధగ Andhra Prabha Top Story

Leave a Reply