AI Data Center | భారత్ కొత్త డిజిటల్ గేట్‌వేగా మారనున్న నగరం

AI Data Center | భారత్ కొత్త డిజిటల్ గేట్‌వేగా మారనున్న నగరం

AI Data Center | హైపర్ స్కేల్ డేటా సెంటర్‌తో భారీ ముందడుగు
అంతర్జాతీయ కనెక్టివిటీకి విశాఖ కేంద్రం
రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న డిజిటల్ మౌలిక వసతులు
100 బిలియన్ డాలర్ల పెట్టుబడితో అదానీ గ్రూప్ ప్లాన్

AI Data Center | ఆంధ్రప్రభ, విశాఖపట్నం : విశాఖపట్నం నగరం దేశంలో ఏఐ విప్లవానికి కేంద్రబిందువుగా మారబోతోందని అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ జీత్ అదానీ అన్నారు. గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడుతూ… 1 గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణం ద్వారా భారత్‌ కృత్రిమ మేధస్సు రంగంలో ఒక పెద్ద ముందడుగు వేసిందన్నారు.

ఇప్పటి వరకు ముంబై, చెన్నై వంటి నగరాలకు మాత్రమే పరిమితమైన డేటా సెంటర్లు ఇప్పుడు విశాఖలోకి అడుగుపెట్టాయని జీత్ అదానీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో కంప్యూట్ రంగంలో విశాఖ అత్యంత కీలక పాత్ర పోషించబోతోందన్నారు.

విశాఖ నగరం ఇక భారతదేశానికి కొత్త డిజిటల్ గేట్‌వేగా మారుతుందని, భారత్‌తో పాటు అంతర్జాతీయంగా పలు ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. ఈ ఏఐ డేటా సెంటర్ దేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తుందని వివరించారు.
సీఎం చంద్రబాబు నాయుడు వంటి విజనరీ నాయకత్వంలో రాష్ట్రంలో డిజిటల్ ఇన్‌ఫ్రా వేగంగా నిర్మితమవుతోందని ఆయన ప్రశంసించారు. విశాఖ నగరం ఏఐ రివల్యూషన్‌కు నాంది పలికిందని పేర్కొన్నారు.

100 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని అదానీ గ్రూప్ నిర్ణయించిందని, ఎక్కువ మంది ప్రజలకు, వాణిజ్యానికి, పరిశ్రమలకు ఏఐ సేవలు అందించడమే తమ లక్ష్యమని జీత్ అదానీ స్పష్టం చేశారు.

AI Data Center
AI Data Center
AI Data Center
AI Data Center
AI Data Center
AI Data Center
AI Data Center
AI Data Center
AI Data Center