2002Haryana | ఏ కేసులో అంటే….

2002Haryana | ఏ కేసులో అంటే….
2002Haryana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రెండు దశాబ్దాల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో మరోసారి ట్విస్ట్ వచ్చింది. పంజాబ్- హర్యానా హైకోర్టు ఇవాళ భారీ తీర్పు ఇచ్చింది. డేరా సచ్ఛా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఇచ్చిన యావజ్జీవ కారాగార శిక్షను రద్దు చేస్తూ, ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.
2002లో హర్యానాలో జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతిపై జరిగిన కాల్పులు, ఆ తర్వాత ఆయన మరణం దేశవ్యాప్తంగా ఆందోళన రేపాయి. డేరా ఆశ్రమంలో జరిగే అకృత్యాలను వెలుగులోకి తెచ్చినందుకే ఆయనను హత్య చేశారనే ఆరోపణలు బలంగా వినిపించాయి. సీబీఐ ప్రత్యేక కోర్టు 2019లో రామ్ రహీమ్‌తో పాటు మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారించి యావజ్జీవ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఇప్పుడు హైకోర్టు రామ్ రహీమ్‌ను నిర్దోషిగా ప్రకటించడంతో ఈ కేసు మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
CLICK HERE TO READ MORE : 4hours |నేడు భారీ సంఖ్యలో లొంగుబాటు
