నిధులు మంజూరు చేయాలని ఎంపీడీకేకు వినతి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొత్తపల్లి, పెద్దపోర్ల గ్రామాల అభివృద్ధికి ఎంపి నిధులు మంజూరు చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు బిజెపి సర్పంచ్,లుఆర్.నర్సిములు, కాశమ్మ, లతోపాటు బిజెపి నాయకులు ముష్టి రాజు, బలరాం, బోయిన్ పల్లి నరేష్ గురువారం వినతిపత్రం సమర్పించారు. పెద్దపోర్ల గ్రామానికి సిసి రోడ్లు డ్రైనేజీ హైమాక్స్ లైట్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తిచేశారు. కొత్తపల్లికి సీసీ రోడ్లు కొత్తపల్లి–పాతపల్లి మధ్య బీటీ రోడ్డు మంజూరు చేయాలనిఅంతర్గత రహదారులు శిథిలావస్థకు చేరుకొని ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రధానంగా వర్షాకాలంలో బురదమయంగా మారి రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని కొత్తపల్లి గ్రామం నుండి పాతపల్లి గ్రామం వరకు ఉన్న రహదారి అధ్వాన్న స్థితిలో ఉండటంతో ప్రజలు విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ రహదారిపై బీటీరోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ఎంపీ నిధులు మంజూరు చేయాలనికోరారు. అందుకు ఎంపీ సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ లు తెలిపారు.

Leave a Reply