18to24genz | సెర్చ్ ఇంజిన్‌కు షాక్ ఇస్తున్న యువత!

18to24genz | సెర్చ్ ఇంజిన్‌కు షాక్ ఇస్తున్న యువత!

18to24genz | గూగుల్ సర్వేలో బయటపడిన షాకింగ్ నిజాలు
విజువల్ కంటెంట్ వైపు మారుతున్న ప్రపంచం
యువతను నిలుపుకునేందుకు గూగుల్ కొత్త వ్యూహాలు

18to24genz | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: మీకు ఏదైనా కొత్త వంటకం కావాలన్నా, టూర్ వెళ్ళడానికి మంచి ప్లేస్ తెలియాలన్నా, లేదా ఏదైనా మొబైల్ రివ్యూ చూడాలన్నా వెంటనే ఏం చేస్తారు? కళ్ళు మూసుకుని ‘గూగుల్’ ఓపెన్ చేసి టైప్ చేస్తారు. కానీ, ఇప్పటి తరం యువత.. ముఖ్యంగా ‘జెన్ జీ’ మాత్రం అలా చేయడం లేదు. వారు సమాచారం కోసం గూగుల్‌ను పక్కనబెట్టి నేరుగా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ సెర్చ్ బార్‌లను వాడుతున్నారు. డిజిటల్ ప్రపంచంలో గూగుల్ ఏకఛత్రాధిపత్యాన్నే సవాలు చేస్తున్న ఈ సరికొత్త ట్రెండ్‌కు గల అసలు కారణాలు తెలుసుకుందాం రండీ..

18to24genz
18to24genz

చదవడం కంటే ‘చూడటమే’ ఇష్టం..

గూగుల్‌లో ఏదైనా వెతికితే టెక్స్ట్ రూపంలో పెద్ద పెద్ద లింకులు, ఆర్టికల్స్ వస్తాయి. వాటిని ఓపెన్ చేసి, చదివి అర్థం చేసుకోవడానికి ఇప్పటి యువతకు ఓపిక లేదు. అదే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వెతికితే.. కేవలం 30 సెకన్ల నుండి ఒక నిమిషం వీడియోలోనే రెసిపీ ఎలా చేయాలో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. విజువల్స్ ద్వారా సమాచారాన్ని త్వరగా గ్రహించవచ్చని యువత నమ్ముతోంది.

ట్రావెల్, లైఫ్ స్టైల్ అప్‌డేట్స్

ఒక ఊరు వెళ్లాలనుకున్నప్పుడు.. ఆ ఊరి గురించి గూగుల్‌లో వ్యాసాలు చదవడం కంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ప్లేస్ పేరు కొడితే.. వందల మంది ట్రావెల్ వ్లాగర్స్ చేసిన రీల్స్ వస్తాయి. అక్కడ బస చేయడానికి బెస్ట్ హోటల్స్ ఏవి? బడ్జెట్ ఎంత అవుతుంది? ఫోటోలు దిగడానికి మంచి లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి? వంటివన్నీ షార్ట్ వీడియోల రూపంలో క్లియర్‌గా, ఆకర్షణీయంగా దొరికేస్తున్నాయి.

గూగుల్ సైతం అంగీకరించిన సత్యం..

ఈ మార్పు కేవలం సోషల్ మీడియా అంచనా మాత్రమే కాదు. గూగుల్ సంస్థ స్వయంగా చేసిన అంతర్గత సర్వేలో.. 18 నుండి 24 ఏళ్ల మధ్య వయసున్న యువతలో దాదాపు 40 శాతం మంది ఏదైనా కొత్త ప్రదేశం లేదా సమాచారం కోసం గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెర్చ్ కాకుండా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ వాడుతున్నట్లు తేలింది.

గూగుల్ తీసుకుంటున్న జాగ్రత్తలు

యువత తమకు దూరమవ్వకుండా ఉండేందుకు గూగుల్ కూడా ఇప్పుడు తన సెర్చ్ ఇంజిన్‌ను మారుస్తోంది. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో కూడా ‘షార్ట్ వీడియోస్’ కనిపించేలా సరికొత్త ఫీచర్లను జోడిస్తోంది.

ఒకప్పుడు ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ అంటే కేవలం వినోదం కోసమే అనుకునేవారు. కానీ నేడు అవి సమాచారాన్ని వెతికే ‘సెర్చ్ ఇంజిన్స్‘ గా మారిపోయాయి. టెక్స్ట్ ఆధారిత సమాచార యుగం ముగిసి.. పూర్తి విజువల్ (వీడియో) ఆధారిత సమాచార యుగం వైపు ప్రపంచం అడుగులు వేస్తోందనడానికి ఈ మార్పే అతిపెద్ద ఉదాహరణ.

click here to read more

click here to read రాపిడ్ ఫైర్‌లో దొర్లిన పొరపాటు

Leave a Reply