Fire Accident | రెస్టారెంట్ లో మంటలు

Fire Accident | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : నగరంలోని బంజారాహిల్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెం.3లో గల ఓ రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరగడంలో అందులో ఉన్న వారు బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
