127 Sheep | ప‌శువుల‌కు ఉచిత వైద్యం…

127 Sheep | ప‌శువుల‌కు ఉచిత వైద్యం…

127 Sheep | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండలంలోని కోనాపూర్ గ్రామంలో పశు వైద్య కళాశాల కోరుట్ల ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని డాక్టర్ యమ్.శ్రీనివాస్(Dr. Ym. Srinivas)(యన్.యస్.యస్) అధికారి ఈ రోజు ప్రారంభించారు. పశువులకు డాక్టర్ గోపాలకృష్ణ,డాక్టర్ విశాల్( గైనకాలజి ప్రొఫేసర్లు ) గర్భనిర్ధారణ పరీక్షలు నిర్వహించి, గర్భ సమస్యల గురించి విశదీకరంగా వివరించి పలు సూచనలు ఇచ్చి తగిన చికిత్సలను నిర్వహించారు.

అలాగే ఇతర అనారోగ్య సమస్యలున్న గొర్రెలు, మేకలకు అనారోగ్య సమస్యల గురించి డాక్టర్ శశాంక్ (మెడిసిన్ ప్రొఫెసర్ ) పరిశీలించి తగు చికిత్సలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 11 ఆవులు, 37 బర్రెలు(11 cows, 37 bulls), 127 గొర్రెలు(127 sheep), 57 మేకలు, 5 కుక్కలకు చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పశువైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ రావు మాట్లాడుతూ పాడి రైతులకు పశువుల గర్భకోశ వ్యాధుల(uterine diseases) గురించి అవగాహన కల్పించి, తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది ప్రవీణ్ రెడ్డి, యల్.యస్.ఎ స్పరన్, గోపాలమిత్ర, పాడి రైతులు, పశు వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply