కాంగ్రెస్ పార్టీ గెలుపు.. అభివృద్ధికి మలుపు

కాంగ్రెస్ పార్టీ గెలుపు.. అభివృద్ధికి మలుపు

  • 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కొలుకుల హైమావతి

కల్వకుర్తి, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కొలుకుల హైమావతి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలతో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గడపగడపకు తిరుగుతూ ఓటర్లను కలిసి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. అభివృద్దే ధ్యేయంగా ప్రజాసేవే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించాలని హైమావతి శ్రీనివాసులు ఓటర్లను కోరుతున్నారు.

కౌన్సిలర్ గా గెలిపిస్తే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కొలుకుల హైమావతి శ్రీనివాసులు ఓటర్లను కోరారు.