అంబేద్కర్ సంఘం అధ్యక్షుడిగా ప్రణయ్ కుమార్

అంబేద్కర్ సంఘం అధ్యక్షుడిగా ప్రణయ్ కుమార్
మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం సమావేశం ఈరోజు నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు.సంఘం అధ్యక్షుడిగా పెరుమాళ్ళ ప్రణయ్ కుమార్, ఉపాధ్యక్షుడిగా ముచ్చపోతుల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా బెల్లపు బాల శివరాజు, కోశాధికారిగా ముచ్చపోతుల తరుణ్ ఎంపికయ్యారు.సాంస్కృతిక కార్యదర్శిగా పెరుమాళ్ళ నరసింహ, ప్రచార కార్యదర్శిగా గోలి శ్రీనివాస్, క్రీడల కార్యదర్శిగా దాసరి సాయిచంద్ బాధ్యతలు స్వీకరించారు. కమిటీ సభ్యులుగా గోలి మారయ్య,గోలి చంద్రమౌళి,లక్క యాదగిరి,లక్క స్వామి, పెరుమాళ్ళ వెంకటేశ్వర్లు, పొగుల దేవేందర్ తదితరులు నియమితులయ్యారు. ఈ ఎన్నికలు గాదరి శరణార్థి,గోలి చెన్నకేశవులు, ముచ్చపోతుల నరసింహ,పెరుమాళ్ళ ప్రమోద్ కుమార్ సమక్షంలో జరిగాయి. అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.

