11th December | ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి
11th December | ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి
- వరంగల్ డీసీపీ ధార కవిత
- ఆర్డీవోతో కలిసి నామినేషన్ సెంటర్ల పరిశీలన
11th December | కమలాపూర్, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కమలాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని వరంగల్ డీసీపీ ధార కవిత(DCP) అన్నారు.
ఈ రోజు అంబాల, గూడూర్, కమలాపూర్ నామినేషన్ సెంటర్ల(Nomination Centers)ను సందర్శించి పరిశీలించారు. హనుమకొండ ఆర్డీఓ రమేష్ రాథోడ్‌తో పాటు ఆమె నామినేషన్ సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
అనంతరం మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ రేపటి (శనివారం) వరకు కొనసాగనుందని, వాటిని దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. డిసెంబర్ 11న(11th December) జరిగే మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. వారి వెంట ఎంపీడీవో గుండె బాబు, స్థానిక సీఐ హరికృష్ణ తదితరులున్నారు.
