టిడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం నాటికి 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత రాష్ట్రానికి సీఎంగా ఆయన పని చేశారు.
ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు, సినీ నటులు, అధికారులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు తనకు మంచి స్నేహితుడని… భవిష్యత్ రంగాలపై దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషి ప్రశంసనీయమంటూ ఎక్స్‌లో మోదీ పోస్ట్ చేశారు..
రేవంత్ రెడ్డి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిc చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, మాజీ సీఎం జగన్, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.