గిరిజన అభివృద్ధి పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
పి ఓ తో కలిసి చర్చించిన ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యే
ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏ ద్వారా గిరిజనుల అభివృద్ధి ఏజెన్సీ గ్రామాల్లో రోడ్లు వంతెనలు మౌలిక వసతులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పీవోతో కోరారు. వారు సోమవారం రాత్రి ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గా నూతన బాధ్యతలు చేపట్టిన మంద మకరంద కు తన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు జై నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్కుడిమేత విశ్వనాథ్ రావు నాయకులతో కలిసి పీవోకు శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాజీ ఎమ్మెల్యే సక్కు పిఓ తో గిరిజన అభివృద్ధిపై చర్చించారు ప్రధానంగా వర్షాకాలంలో వ్యాధులు ప్రభులే అవకాశాలు ఉన్నాయని వర్షాల వల్ల రోడ్ల, వంతెనల వల్ల జరిగే నష్టాలపై చర్చించినట్లు పార్టీ నాయకులు ద్వారా తెలిసింది. ఐ టి డి ఏ నిధులతో గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని విద్యా ఆరోగ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పిఓ కు కోరినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ చైర్మన్ కూడ్మేత విశ్వనాధ్ రావు, ఇంద్రవెల్లి మార్కెట్ వైస్ చైర్మన్ సోయం మారుతీ, నార్నూర్ మండల సర్పంచ్లు శ్రీ ఆత్రం పర్ మేశ్వర్, కనక సత్యం, కుంరం మహాదు, కుంరం జ్ఞానేశ్వర్, కేరమేరి తుమ్మగూడ సర్పంచ్ కుంరం భీంరావ్, కాశిపేట్ తాటిగూడ సర్పంచ్ మాడవి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్రం దత్తు, బండి సాయి కుమార్ పాల్గొన్నారు.
