దేశాన్ని విశ్వ గురువుగా నిలపడమే హిందూ సమ్మేళనాల లక్ష్యం..

దేశాన్ని విశ్వ గురువుగా నిలపడమే హిందూ సమ్మేళనాల లక్ష్యం..
జగిత్యాల ధర్మ పరిరక్షణ పీఠాధిపతి లక్ష్మీ నారాయణ
జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లిన నేరేడుచర్ల
భజన, కోలాట బృందాలతో భారీ బైక్ ర్యాలీ
నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : హిందూ సమాజాన్ని జాగృతం చేసి, సమైక్యపరచి మన దేశాన్ని విశ్వ గురువుగా నిలపాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు జగిత్యాల ధర్మ రక్షణ పీఠాధిపతి డాక్టర్ లక్ష్మీనారాయణ స్వామీజీ, అఖిలభారత ధర్మజాగరణ ప్రముఖ్ ఆలే శ్యామ్ కుమార్ లు పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితి నేరేడుచర్ల అధ్యక్షులు పులిజాల వెంకట రమణా రావు అధ్యక్షతన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలోని ఎస్కెఎస్ ఫంక్షన్ హాల్ ఆవరణలో నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మేళన కార్యక్రమాలలో కోట్లాదిమంది హిందూ బంధువులు పాల్గొంటున్నారని అన్నారు. హిందువు అనేది ఒక మతం కాదు ఒక జాతి అని అన్నారు. సుమారు 50 దేశాలలో, లక్ష గ్రామాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శాఖలుగా ఏర్పడి హిందూ సమాజ జాగృతి, ఐక్యత చైతన్యం కోసం పనిచేస్తుందన్నారు.

ఆర్ఎస్ఎస్ కారణంగానే హిందుత్వంపై సమాజంలో గౌరవం పెరిగిందన్నారు. లవ్ జిహాదీ పేరుతో మత మార్పిడి చేసి ఇస్లాం దేశంగా మార్చాలని కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు కుట్ర పన్నుతున్నాయని వాటిని తిప్పికొట్టాలన్నారు. ఆర్ఎస్ఎస్ లో పనిచేసే సేవకులను కులం అడగమని కేవలం హిందువు అయితే సరిపోతుందన్నారు. అలాగే పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు కులం అడ్డు రాదని హిందువు అయితే చాలని ఆసక్తి కలిగిన వారికి ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామని ఈ విషయమై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బ్రాహ్మణులు మాత్రమే పౌరోహిత్యం చేయాలా అని ప్రశ్నించిన విషయమై ఇదే సమాధానమన్నారు.

లవ్ జిహాదీల పేరుతో ఇతర ప్రలోభాల వల్ల హిందూ మతాన్ని వదిలి వెళ్ళినవారిని తిరిగి హిందూ మతంలోకి రావాలని పిలుపునిచ్చారు. హిందువులు సంఘటితంగా ఐక్యతగా లేకపోవడం వలన స్వతంత్రత కోల్పోతున్నామని, నేటి కాలమాన పరిస్థితుల్లో ఎదురవుతున్న అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు హిందువుల ఐక్యత అవసరమన్నారు.
హిందూ సమాజం పట్ల గౌరవభావం ఏకాత్మత భావం స్వధర్మం పట్ల అంకితభావం సేవాగుణం వంటి వాటిని వికసింప చేసేందుకు హిందూ సమ్మేళనాలు దోహద పడతాయన్నారు. అంతకుముందు పాత నేరేడుచర్ల అభయాంజనేయ స్వామి దేవాలయం నుండి శ్రీరాముడు ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రత్యేక వాహనాలపై ఏర్పాటు చేసి హిందూ బంధువులందరూ బైక్ ర్యాలీగా జైశ్రీరామ్ నినాదాలతో నేరేడుచర్ల వీధులను దద్దరిల్లగా ఎస్కేఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు తరలివచ్చారు.
ఈ ర్యాలీలో వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందం కోలాటం బృందం ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో వీరవల్లి శ్రీలత కోటేశ్వర రావు వ్యాఖ్యాతగా వ్యవహరించగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కళ్లెం స్వప్న,స్థానిక మున్సిపల్ చైర్మన్ కొణతం చిన వెంకటరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకాగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు మెట్టు వేణుగోపాలరెడ్డి మాశెట్టి మోహన్, వీరవల్లి కోటేశ్వరరావు, తాటికొండ శ్రీనివాసరెడ్డి చామకూరి వీరయ్య గౌడ్, రాచకొండ రామ కోటేశ్వరరావు, పోలిశెట్టి వెంకటేశ్వర్లు, కొత్తా లక్ష్మణ్ రాచకొండ శ్రీనివాసరావు, బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, పమ్మి రాంబాబు, రాచకొండ శేఖర్, శేఖర్ చారి, సపావత్ రాము, వీరవల్లి శ్రీలత, దొండపాటి అప్పిరెడ్డి, కొణతం సత్య నారాయణ రెడ్డి,నాగండ్ల శ్రీధర్,తాళ్లూరి లక్ష్మీ నారాయణ, రాచకొండ రామన్న, కొణతం సీతారాం రెడ్డి, బట్టు మధు, కొణతం కృష్ణారెడ్డి, కొణతం ఆదిరెడ్డి, కట్టా గణేష్ రెడ్డి, రాచకొండ రామ కోటేశ్వరరావు,మాశెట్టి సైదయ్య, రాచకొండ అంజయ్య, కంది బండ శ్రీనివాసరావు, ఊటుకూరు నటరాజ్, కొణతం లచ్చిరెడ్డి, కొణతం నాగిరెడ్డి చింతకుంట్ల రాజేష్ రెడ్డి, ఏమి రెడ్డి శంకర్ రెడ్డి, జగిని సురేష్, చలసాని శ్రీనివాస్ రావు, మెట్టు శ్రీనివాసరెడ్డి, కొప్పు లక్ష్మీనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
