అదుపుతప్పి కారు బోల్తా

అదుపుతప్పి కారు బోల్తా
- ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
భీమదేవరపల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని భీమదేవరపల్లి క్రాస్ రోడ్ వద్ద అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, హుస్నాబాద్ నుండి హనుమకొండ వైపు వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ (TS02FG039) కారు భీమదేవరపల్లి క్రాస్ రోడ్ వద్ద అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో అక్కన్నపేట మండలం పోతారం గ్రామానికి చెందిన చిలుమల భాస్కర్ (42) అక్కడికక్కడే మృతి చెందాడు.
కారులో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ముల్కనూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
