కాంగ్రెస్ నాయకురాలు సరోజినమ్మ మృతి బాధాకరం: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

రామాపురంలో పార్థివదేహానికి నివాళి..

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

నడిగూడెం, (ఆంధ్రప్రభ): సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం సర్పంచ్ బూత్కూరి వెంకట్‌రెడ్డి తల్లి, కాంగ్రెస్ నాయకురాలు బూత్కూరి సరోజినమ్మ మృతి పార్టీకి తీరని లోటని స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. ఆదివారం రామాపురంలో సరోజినమ్మ పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించిన ఆమె, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ సభ్యుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, నడిగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కా బిక్షపతి, వివిధ గ్రామాల సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు పాల్గొని సరోజినమ్మకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.