కాలయముడైన కన్నతండ్రి!

కాలయముడైన కన్నతండ్రి!

కూతురు గొంతు నులిమి హత్య

ఆంధ్రప్రభ, యాదాద్రి : నిన్నటిదాకా ఆ ఇంట్లో ఆ చిన్నారి ముద్దులొలికే మాటలు.. అడుగు తీసి అడుగు వేస్తుంటే గజ్జెల సవ్వడులు.. ఆ తల్లిదండ్రులకు ఆ పాప ఒక లోకం. కానీ, క్షణికావేశం ఒక పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది. భార్యాభర్తల మధ్య రేగిన వివాదం, చివరకు పసి ప్రాణాన్ని బలి తీసుకుంది. కన్న తండ్రే కూతురుని గొంతు నులిమి చంపిన దారుణ ఘటన బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హన్మాపురం గ్రామంలో చోటుచేసుకుంది. రెండు ఏళ్ల కన్న కూతురిని తండ్రి శ్రీరాములు గొంతు నులిమి హత్య చేసాడు. అయితే గతకొంత కాలంగా శ్రీరాములు, నాగరాణి దంపతులకు విభేదాలు రావడంతో నాగమణి పుట్టింటికి వెళ్లింది. పెద్దలు సర్దిచెప్పడంతో ఉగాది నాడు తిరిగి భర్త వద్దకు వచ్చింది. శ్రీరాములు, నాగరాణి దంపతులు ఇద్దరు మూగవారే. అయితే మళ్లీ మనస్పర్థలు రావడంతో భార్య మీద కోపంతో కూతురి గొంతు నులిమి చంపాడు. అనంతరం భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో శ్రీరాములు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply