సెటిల్మెంట్ కు దిగొచ్చిన యూట్యూబ్ !!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన కేసులో యూట్యూబ్ పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వచ్చింది. తన పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఇంక్ తరఫున యూట్యూబ్ $24.5 మిలియన్ (సుమారు రూ.200 కోట్లకు పైగా) చెల్లించేందుకు అంగీకరించింది.
2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ అల్లర్ల తర్వాత ట్రంప్ అకౌంట్ ను సస్పెండ్ చేయడంపై ఈ కేసు దాఖలయింది. ట్రంప్, యూట్యూబ్ & ఆల్ఫాబెట్ ఇంక్‌పై.., ఆయన ఫస్ట్ అమెండ్‌మెంట్ హక్కులను ఉల్లంఘించారని, అలాగే కన్సర్వేటివ్ వాయిస్‌లను అణచివేయడం జరిగింది అని ఆరోపించారు.
సస్పెన్షన్ వివరాలు..
2021 జనవరి 12న యూట్యూబ్, హింస ప్రేరేపించే విధానాలు జరిగాయని చెప్పి ట్రంప్ ఛానల్‌ను మొదట ఏడు రోజుల పాటు సస్పెండ్ చేసింది. కానీ పరిస్థితి తీవ్రమవడంతో సస్పెన్షన్‌ను తరువాత నిరవధికంగా పొడిగించారు.
సెట్టిల్‌మెంట్ వివరాలు..
యూట్యూబ్ మొత్తం $24.5 మిలియన్ (₹200 కోట్లకు పైగా) చెల్లించనుంది. అందులో $22 మిలియన్ (సుమారు రూ.181 కోట్లు) ట్రస్ట్ ఫర్ ది నేషనల్ మాల్ అనే నాన్-ప్రాఫిట్ సంస్థకు వెళ్తుంది. ఈ సంస్థ వైట్ హౌస్‌లో $200 మిలియన్ బాల్‌రూమ్ నిర్మిస్తోంది.
మిగిలిన $2.5 మిలియన్ ఇతర వాదిదారులు, ముఖ్యంగా అమెరికన్ కన్సర్వేటివ్ యూనియన్, రచయిత నవోమి వోల్ఫ్‌కు ఇవ్వనున్నారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ సెటిల్‌మెంట్‌లో యూట్యూబ్ తప్పు అంగీకారం చేయలేదు. దీర్ఘకాలిక న్యాయపోరాటంతో వచ్చే ఖర్చులు తప్పించుకోవడానికి మాత్రమే యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంది.
