యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు..

చెన్నూర్, ఆంధ్రప్రభ : యువత గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు బానిస కావద్దని చెన్నూర్ ఏ ఎస్సై మజీద్ సూచించారు. పోలీసుల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు మత్తుపదార్థాల వాడకాన్ని నిషేదించాలని అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఏ సై మజీద్ మాట్లాడుతూ.. యువత ఎంచ్చుకున్న లక్ష్యాన్ని టార్గెట్ చేసుకొని ఫలితాలు సాధించి తమ ఉజ్వల భవిష్యత్ ను నిర్మించుకోవాలని సూచించారు, చెడు అలవాట్లు విద్యార్థుల బంగారు భవిష్యత్ లేకుండా చేస్తాయని అన్నారు.
