విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ


విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

తొలి రోజే పుస్తకాలు, నోట్‌బుక్స్ అందజేత

దండేపల్లి, (ఆంధ్రప్రభ): వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో దండేపల్లి మండల కేంద్రంలోని పీఎం శ్రీ సెకండరీ పాఠశాల విద్యార్థుల సందడితో కళకళలాడింది. 2026-27 విద్యా సంవత్సరానికి శ్రీకారం చుడుతూ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు.

స్థానిక సర్పంచ్ అజ్మీరా రాజేశ్వర్ నాయక్ చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి ప్రభుత్వం అందిస్తున్న విద్యా వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో కూడిన విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల చైర్‌పర్సన్ అనిత, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ముత్యాల శ్రీనివాస్, ఉపసర్పంచ్ సిరికొండ నవీన్, వార్డు సభ్యులు సత్యం గంగారాం, కార్యదర్శి హరీష్, ప్రధానోపాధ్యాయులు సంగర్సు రాజేశ్వర్‌రావు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాల ప్రాంగణం విద్యార్థుల కోలాహలంతో సందడిగా మారింది.