Young People | అక్కడికక్కడే ముగ్గురు…

Young People | అక్కడికక్కడే ముగ్గురు…

Young People | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా భోగాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

అతివేగంగా బైక్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. బలంగా ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

అతివేగంగా వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.